బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (16:46 IST)

మంచు విష్ణు హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకు నాగబాబు ఆర్థిక సహాయం

Nag srinu family- nagababu
హెయిర్ డ్రెస్సెర్ ఉప్పలపు నాగ శ్రీను ప్రస్తుతం కష్టకాలం లో ఉన్నాడు. అతని తల్లి ఆరోగ్యం మరింత క్షీణించడం, అతనికి గత సంస్థ నుండి జీతం కూడా సరిగ్గా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాడు. అతని ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని నటుడు నిర్మాత నాగబాబు హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకు చిరు సాయంగా 50,000/- రూపాయలు అందించడం జరిగింది. 
 
అలాగే నాగ శ్రీను చిన్నారులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి ఎటువంటి సమస్య లేకుండా పూర్తి వైద్య సహాయం కోసం అపోలో ఆసుపత్రి నందు వారికి ఫ్రీ మెడికల్ చెకప్ చేసే సకల ఏర్పాట్లకు నాగబాబు అతని కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి ఆపద వచ్చినా టక్కుమని స్పందించే నాగబాబు గారి సహాయానికి హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీను కుటుంభం కృతఙ్ఞతలు తెలిపింది. 
 
కాగా, మంచు విష్ణు ద‌గ్గ‌ర ప‌దేళ్ళ‌పాటు ప‌నిచేసిన నాగ‌శ్రీ‌ను ఇటీవ‌లే ఆయ‌న తండ్రి న‌టించిన `స‌న్నాఫ్ ఇండియా` గురించి మోహ‌న్‌బాబు టీమ్‌తో కామెంట్ చేయ‌డం, సూచ‌న‌లు చేయ‌డం జ‌రిగింది. దాంతో ఆగ్ర‌హించిన విష్ణు  నిమ్న‌జాతికి చెందిన వాడివి నువ్వా నాకు చెప్పేది అంటూ హేళ‌న చేయ‌డ‌మే కాకుండా అనంత‌రం ఆయ‌న‌పై దొంగ‌త‌నం కేసు బ‌నాయించాడు. దీనిపై ప్ర‌స్తుతం కుల సంఘాలు పోరాడుతున్నాయి.