శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 మే 2022 (15:15 IST)

బాచుపల్లి జంక్షన్‌లో ట్రాఫిక్‌‌కు ఇక కళ్లెం.. త్వరలోనే ఫ్లై-ఓవర్

bachupally
bachupally
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా బాచుపల్లి జంక్షన్‌లో ట్రాఫిక్‌ జామ్‌లకు చెక్‌ పడనుంది. ఈ ప్రాంతంలో ఫ్లై-ఓవర్ రానుంది. 
 
దాంతో పాటు, బాచుపల్లి నుంచి బౌరంపేట వరకు, బహదూర్‌పల్లి నుంచి కొంపల్లి వరకు రోడ్ల విస్తరణను కూడా ఏకకాలంలోనే హెచ్‌ఎండీఏ (హెచ్ఎండీఎ) చేపట్టనుంది.
 
రూ.141 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల చివరిలోగా టెండర్లను పూర్తి చేసి రెండేళ్లలో బాచుపల్లి జంక్షన్‌ దశ, దిశను మార్చేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపడుతోంది. 
 
బాచుపల్లి జంక్షన్‌లో కూడా వాహనాల రద్దీ అమాంతం పెరిగింది. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రం అయ్యాయి.