కరోనా వైరస్ పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖాధికారులందరూ పూర్తి అప్రమంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామాత్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని)ఆదేశించారు.
ఈ మేరకు ఆయన కరోనా వైరస్ పై రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడారు. 28 రోజుల్లోపు ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే వెంటనే మాస్క్ ధరించడంతో పాటు సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని ఆయన ప్రజలకు సూచించారు.
అత్యవసర సమాచారం కోసం 1100, 1102 టోల్ ఫ్రీ నంబర్లకు లేదా 7013387382, 8008473799 మొబైల్ నంబర్లకు ఫోన్ చేయాలని చెప్పారు. కరోనా వైరస్ పర్యవేక్షణకు జిల్లాలు వారీగా వెంటనే నోడల్ అధికారులను నియస్తున్నట్టు తెలిపారు.
విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కరోనా వైరస్ ను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని దానిలో భాగంగా స్కానింగ్ పరికరాలు,మాస్క్ లను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారాలను మంత్రి నాని ఆదేశించారు. కరోనా వైరస్ పై ఇప్పటికే రాష్ట్రస్థాయి వైద్యశాఖ అధికారులు జిల్లా స్థాయి వరకూ ఇచ్చిన మార్గదర్శక ఆదేశాలు జిల్లాలకు చేరాయా అని మంత్రి ఆరా తీశారు.
వివిధ జిల్లాల పరిధిలోని ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండడంతో పాటు ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) ఆదేశించారు.
కరోనా వైరస్ పై జిల్లాల వారీగా నియమించిన నోడలు అధికారులు వారి ఫోన్ నంబర్లు:
జిల్లా పేరు నోడల్ అధికారి పేరు ఫోన్ నెంబరు
శ్రీకాకుళం డా.బి.జగన్నాథరావు 9963994337
విజయనగరం డా.యమ్.చామంతి 9492024155
విశాఖపట్నం డా.యమ్.పార్థసారధి 7382555264
తూర్పు గోదావరి డా.యమ్ మల్లికార్జున్ 9392133322
పశ్చిమ గోదావరి డా.కె.సురేశ్ బాబు 9440471232
కృష్ణా డా.అమృతం 9491647614
గుంటూరు డా.పి.రత్నవల్లి 8309176892
నెల్లూరు డా.ఆర్.స్వర్ణలత 9440294507
చిత్తూరు డా.సుదర్శన్ 8790995129
కడప డా.కె.కొండయ్య 9848399496
అనంతపురం డా.సి.పద్మావతి 9849902398
కర్నూలు డా.సి.శ్రీదేవి 9849902411