శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మార్చి 2023 (10:50 IST)

మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం...

ఏపీలోని పల్నాడు జిల్లాలో మతిస్థిమితం లేని బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టారు. బాబాయి అంటూ పిలుస్తూ వచ్చిన ఆ బాలికపై కన్నేసిన కామాంధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
పల్నాడు జిల్లా అమరావతి మండలం నెమలికల్లులో 13 యేళ్ల బాలిక మతిస్థిమితంతో బాధడుతూ ఇంట్లోనే ఉంటూ వచ్చిది. అయితే, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నెమలికల్లుకు చెందిన బాలికను అదే కాలనీకి చెందిన బుల్లా హజరత్‌ మస్తాన్‌ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అనంతరం బాలిక తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు అమరావతి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ శనివారం నెమలికల్లు వెళ్లి విచారణ జరిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.