Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సీఎం కావాలి... ప్రత్యేక రొట్టెను అందుకున్న అనిల్ కుమార్ యాదవ్

మత సామరస్యానికి ప్రతీక అయిన రొట్టెల పండుగ నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషహీద్ దర్గాలో మూడు రోజుల క్రితం ప్రారంభమైంది. ఈ పండుగ సందర్భంగా భక్తులు తమ కోర్కెలు నెరవేరడానికి రొట్టెలను కొనుగోలు చేసి, అదే

Written By selvi
Updated: మంగళవారం, 3 అక్టోబరు 2017 (17:11 IST)
మత సామరస్యానికి ప్రతీక అయిన రొట్టెల పండుగ నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషహీద్ దర్గాలో మూడు రోజుల క్రితం ప్రారంభమైంది. ఈ పండుగ సందర్భంగా భక్తులు తమ కోర్కెలు నెరవేరడానికి రొట్టెలను కొనుగోలు చేసి, అదే కోరికను అప్పటికే తీర్చుకున్న వారితో వాటిని మార్పిడి చేసుకోవడం ఆనవాయతీ. ఈ పండుగలో నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
 
బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువులో ప్రత్యేక రొట్టెను అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్రానికి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల వివరాలను ఇంటింటికి వెళ్లి తెలియజేసే కార్యక్రమాన్ని అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. అన్న వస్తున్నాడు.. అనే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలియపరుచవచ్చునని అనిల్ కుమార్ వెల్లడించారు.

కాగా నవంబర్ 2న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ మహాపాదయాత్ర మొదలు కానుంది. దీనికి ఒకరోజు ముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత తిరుమల నుంచి ఇడుపులపాయకు వెళ్లి.. అక్కడ నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నారని సమాచారం. ఇప్పటికే జగన్ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను వైసీపీ సిద్ధం చేసింది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments