బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (14:28 IST)

దేవరాజ్ పంపిన మెసేజ్‌లు చదివాకే.. శ్రావణి బాత్రూమ్‌లో ఉరేసుకుంది.. శ్రావణి తల్లి

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం అయిన విషయం తెలిసిందే. దేవరాజ్, సాయి, అశోక్ రెడ్డి.. ఈముగ్గురులో శ్రావణి ఎవరు వలన ఆత్మహత్య చేసుకుంది అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే.. శ్రావణి తల్లి పాపారత్నం సంచలన విషయాలను బయటపెట్టింది. ఇంతకీ శ్రావణి తల్లి పాపారత్నం ఏం చెప్పిందంటే... 
శ్రావణిని ప్రేమ పేరుతో దేవరాజు మోసం చేశాడు. 
 
జూన్‌లో దేవరాజు పై కేసు పెట్టాం. దేవరాజుపై కేసు నమోదైన తరువాత అనేక డ్రామాలు ఆడాడు. లాక్‌డౌన్‌ తరువాత కోర్టులు తెరిస్తే కేసు కాంప్రమైజ్ చేసేందుకు మళ్ళీ ప్రేమ నాటకాలు ఆడాడు.
 
 ప్రేమ పేరుతో శ్రావణిని మాయలో పడేశాడు. అతన్ని గుడ్డిగా నమ్మింది. కేసు కొట్టించేయడం కోసం శ్రావణిని అన్ని రకాలుగా మోసం చేశాడు‌. కేసు కొట్టి వేసే క్రమంలో దేవరాజు శ్రావణి పై అఘాయిత్యానికి పాల్పడతాడేమోనని సాయి కృష్ణను అండగా ఉంచాం. 
 
హోటల్‌కి వెళ్ళినప్పుడు శ్రావణిని తీసుకురమ్మని నేనే సాయికృష్ణ పంపించాను. శ్రావణి స్నానం చేస్తానని బాత్రూమ్‌లోకి వెళ్ళిన కొద్దిసేపటికే దేవరాజు నుండి కాల్‌తో పాటు మెసేజ్ కూడా వచ్చింది. కొద్దిసేపటికే మళ్లీ ఆ మెసేజ్ డిలీట్ చేశాడు. ఆ మెసేజ్ చదివిన శ్రావణి బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు అని శ్రావణి తల్లి పాపారత్నం చెప్పింది.