ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (21:50 IST)

రిలయన్స్ ద్వారా 50వేల మందికి ఉద్యోగాలు.. ముకేశ్ అంబానీ

ambani - jagan
రిలయన్స్ ద్వారా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 50 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్‌ ద్వారా యాభై వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
 
ఇక ఆంధ్రప్రదేశ్‌లో 20 రంగాలకు సంబంధించి 340 మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.13 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. 
 
ఈ పెట్టుబడి వల్ల ఆంధ్రాలో దాదాపు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.