సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (11:54 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశ భేటీ తేదీ ఖరారు

jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వ తదుపరి మంత్రివర్గ సమావేశం ఈ నెల 14వ తేదీన జరుగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంత్రి మండలి సమావేశం తేదీని ఖరారు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఏపీ సచివాలయంలోని ఒకటో బ్లాకు‌లో ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ మంత్రి మండలి సమావేశం జరుగుతుందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఈ కేబినెట్ భేటీలో చర్చించి, ఆమోదం తెలుపనుంది.