బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (14:58 IST)

ఏపీలో పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు..

ysjagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకుల భద్రత కోసం కొత్తగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. వీటిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పర్యాటకుల భద్రత కోసం ఈ పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. పర్యాటక ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే వీటిని నెలకొల్పామని చెప్పారు. 
 
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు భయం, ఇబ్బంది లేకుండా ఈ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పారు. మొత్తం కోస్తా తీరంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో 26 పర్యాటక పోలీస్ స్టేషన్లను ప్రారంభించినట్టు సీఎం జగన్ గుర్తుచేశారు.