మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2022 (08:40 IST)

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం..

munugode bypoll vote count
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడు అంచెల భద్రను కల్పించారు. దీంతో అన్ని పార్టీలన్నీ అటెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. 
 
ఈ ఓట్ల లెక్కింపునకు మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల లోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. రౌండ్ల వారీగా ఫలితాలను కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లలో ప్రదర్శిస్తారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉన్న మునుగోడు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తికానుమంది. 
 
తుది ఫలితాన్ని 3 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఓట్ల లెక్కింపు మాత్రం మధ్యాహ్నం 12 గంటలకే పూర్తికానుంది. కాగా, ఈ నెల 3వ తేదీన జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైన విషయం తెల్సిందే. మొత్తం 241805 ఓట్లకుగాను 225192 ఓట్లు పోలయ్యాయి.