శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (06:47 IST)

వైకాపా అభ్యర్థి శిల్పాకు ఓటేసి గెలిపించండి.. 'నాగార్జున' ఫ్యాన్స్‌కు పిలుపు

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డికి సినీ హీరోల అభిమానులు మద్దతు ప

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డికి సినీ హీరోల అభిమానులు మద్దతు పలుకుతున్నారు. 
 
మొన్నటికిమొన్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ మద్దతు పలకగా, ఇపుడు అక్కినేని నాగార్జున అభిమానులు అండగా నిలిచారు. ఎన్నికల్లో తాము శిల్పాకు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామరాజు ప్రకటించారు. 
 
నాగ్ అభిమానులంతా శిల్పాకు ఓటేసి.. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా, శిల్పాకు సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేశ్‌ బాబు అభిమానులు మద్దతు ఇస్తారని నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నంద్యాల ఉప ఎన్నికలకు సినీ రంగు కూడా అంటుకుంది. 
 
భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఈనెల 23వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు.