శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2017 (18:16 IST)

నంద్యాల ఎన్నికలు.. పవన్ కల్యాణ్ మాకే మద్దతిస్తారు : భూమా మౌనిక

జ‌నసేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నంద్యాల ఉప ఎన్నికల్లో తమకే మద్దతిస్తారని.. భూమా నాగిరెడ్డి చిన్న‌ కూతురు భూమా మౌనిక ధీమా వ్యక్తం చేశారు. పవ‌న్ కల్యాణ్ మొద‌టినుంచి త‌మ కుటుంబానికి సన్నిహితుడ

జ‌నసేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నంద్యాల ఉప ఎన్నికల్లో తమకే మద్దతిస్తారని.. భూమా నాగిరెడ్డి చిన్న‌ కూతురు భూమా మౌనిక ధీమా వ్యక్తం చేశారు. పవ‌న్ కల్యాణ్ మొద‌టినుంచి త‌మ కుటుంబానికి సన్నిహితుడేన‌ని, గ‌తంలోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ త‌ల్లిదండ్రుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని మౌనిక మీడియా సమావేశంలో వెల్లడించారు. 
 
కాగా భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల ఉప ఎన్నిక‌ల బ‌రిలో తెలుగుదేశం పార్టీ నుంచి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు నంద్యాలలో టీడీపీదే విజయమంటోంది. మరోవైపు విపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 
 
ఇంకా కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక విజయం మాదేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలలో తాము గెలుపు కోసమే కాకుండా, మెజారిటీపై కూడా దృష్టి పెట్టామన్నారు. వైఎస్‌ జగన్‌కు నంద్యాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో పనులు ప్రారంభించి, దానినే అభివృద్ధి అని చంద్రబాబు సర్కార్‌ చెప్పుకుంటోందని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.