Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

"మేలుకో తెలుగోడా.." పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్ర

Written By వరుణ్
Updated: ఆదివారం, 1 అక్టోబరు 2023 (14:29 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, తన భర్త నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన వైకాపా ప్రభుత్వం ఇపుడు ఆయన కుమరుడు నారా లోకేశ్‌ను కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టాలని భావిస్తుంది. ఎన్నికల సమయంలో వారిద్దరూ బయట లేకుండా చేయాలన్న పక్కా ప్లాన్‌తో వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారంటూ రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పార్టీని నడిపించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రంగంలోకి దిగుతున్నారు. 
 
తన భర్త జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు ఆమె పార్టీని ముందుండి నడిపించనున్నారు. ఇందుకోసం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా "మేలుకో తెలుగోడా..." అనే పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అక్టోబరు మొదటి వారంలో బస్సు యాత్రను ఆమె ప్రారంభించనున్నారు. 
 
ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారనీ, అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ బస్సు యాత్ర, సభలు, ఏర్పాటు చేసేలా దీన్ని సిద్ధం చేశారు. దీనికి మేలుకో తెలుగోడా అనే పేరును ఖరారు చేయగా, వారం నుంచి పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. 

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments