నేడు వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధుల విడుదల
ఏపీ ప్రభుత్వం శుక్రవారం వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధులను విడుదల చేయనున్నారు. విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారు.
వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా రాష్ట్రంలోని ఆటోలు, క్యాబ్‌లు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారికి జగన్ ప్రభుత్వం యేడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తుంది. ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వాహన మిత్ర పథకంలో భాగంగా నాలుగు పర్యాయాలు ఈ నిధులను విడుదల చేశారు.
కాగా, శుక్రవారం జరిగే కార్యక్రమం కోసంజగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. సభ ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేసింది.