శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (09:20 IST)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఎల్లో అలెర్ట్

Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు హైఅలర్ట్ ప్రకటించారు. 
 
కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ 3 వరకు భారీ వర్షాలు కురుస్తాయని దీంతో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. 
 
ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వచ్చే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు.