శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (10:56 IST)

వెయ్యి కిలోమీటర్లకు చేరువలో నారా లోకేష్

lokesh padayatra
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారంతో 74వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఆలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు లోకేష్ 949 కిలో మీటర్ల దూరం నడిచారు. తద్వారా వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన రికార్డుకు చేరువలో వున్నారు. 
 
ఉదయం 11.30 గంటలకు దేవరకొండ క్రాస్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులతో భేటీ కానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వలగొండ క్రాస్ వద్ద బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. ఈ రోజు రాత్రికి వలగొండ క్రాస్ వద్ద బస చేస్తారు.