శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (14:28 IST)

నారా దేవాన్ష్ బర్త్‌డే - తితిదే కు లోకేశ్ - బ్రహ్మణి విరాళం ఎంతో తెలుసా?

nara devansh
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ - బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ మార్చి 21వ తేదీ మంగళవారం పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని నారా లోకేశ్ దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు విరాళం అందించారు. తితిదే భక్తులకు అన్నదానం చేసేందుకు ఒక రోజుకు అయ్యే ఖర్చును వారు విరాళంగా ఇచ్చారు. 
 
తమ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి యేటా వారు తమకు తోచిన విధంగా విరాళం ఇస్తున్న విషయం తెల్సిందే. ఈ యేడాది కూడా వారు విరాళం ఇచ్చారు. నారా దేవాన్ష్‌ పేరిట విరాళం ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని తెలుపుతూ తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు.