1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 25 ఫిబ్రవరి 2023 (16:16 IST)

జూనియర్ ఎన్టీఆర్‌ను నారా లోకేష్ ఆహ్వానించడం ఏమిటి? కొడాలి నాని

టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను నారా లోకేష్ ఆహ్వానించడం ఏమిటని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నారా లోకేష్‌కు విశ్వసనీయత లేదని కొడాలి నాని విమర్శలు గుప్పించారు. అందుకే మంగళగిరిలో బ్రహ్మణి ప్రచారం చేసినా లోకేశ్ ఓడిపోయారని గుర్తు చేశారు. అక్కడ బ్రహ్మణి పోటీ చేసి ఉంటే గెలిచేవారని చెప్పారు.
 
జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలిస్తే కనీసం ప్రతిపక్ష హోదా దక్కుతుందని కొడాలి నాని అన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని, ఆ తర్వాత అవమానించారని... చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా అనుభవించాడని చెప్పారు.  
 
టీడీపీనీ స్థాపించిందే జూనియర్ ఎన్టీఆర్ తాత అని చెప్పారు. టీడీపీ గెలుస్తుందనే నమ్మకం లేకే పార్టీలోకి తారక్‌ను రమ్మంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే టీడీపీ ఊబిలాంటిదని... ఆ పార్టీని రక్షించేందుకు ఎవరు వెళ్లినా కూరుకుపోవడం ఖాయమని చెప్పారు.