గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (18:38 IST)

దొంగదెబ్బలు కాదు.. టైమ్ ఫిక్స్ చేసుకుందాం.. చంద్రబాబు సవాల్

chandrababu
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వైకాపా నేతలపై ఫైర్ అయ్యారు. గన్నవరం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు వైకాపా తీరుపై మండిపడ్డారు. గన్నవరంలో పర్యటించిన ఆయన టీడీపీ ఆఫీస్‌ను పరిశీలించారు. 
 
"టైమ్‌ ఫిక్స్‌ చేసుకుందాం.. ఎన్నివేల మంది వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. దొంగదెబ్బలు తీయడం కాదు.. పోలీసులను వదిలేసి రావాలంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడానికి కారణం పోలీసులేనని తీవ్రస్థాయిలో ఆరోపించారు. 
 
చంద్రబాబు సవాల్‌పై మాజీ మంత్రి కొడాలినాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు సవాల్‌ విసిరితే ముఖ్యమంత్రి జగన్‌ రావాలా అని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు సవాల్‌కు భయపడాలా అని నిలదీశారు. పిచ్చిపట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.