భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త కన్నుమూత
భారత తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పని చేశారు. ఈమె గత 2007 జూలై 25 తేదీ నుంచి 2012 జూలై 25వ తేదీ వరకు ఉన్నారు. అయితే, ఈమె భర్త దేవీసింగ్ షెకావత్ కన్నుమూశారు. ఆయన వయసు 89 యేళ్లు. రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను మహారాష్ట్రలోని పూణెలో ఉన్న కేఈఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ అయితే, శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆయన మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా, దేవీసింగ్ షెకావత్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి గత 1985లో శాసన సభ్యుడిగా గెలుపొందారు. పైగా, ఈయన ఒక గొప్ప విద్యావేత్త కావడం గమనార్హం. 1972లో ముంబై విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీని అందుకున్నారు. అలాగే, అమరావతి నగర తొలి మేయరుగా కూడా పని చేశారు. ఆయన దేశ తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డుపుటలకెక్కాడు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.