బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (09:59 IST)

గంజాయి అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్ అడ్డానా? కేంద్రమంత్రి ఏమన్నారు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడేళ్ళ కాలంలో గంజాయి అక్రమ రవాణా ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా, మూడు రెట్లు పెరిగింది, గత యేడాది కాలంలోనే ఏకంగా లక్ష కేజీల వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.
 
టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఓ ప్రశ్న వేశారు. ఏపీలలో గతంలో ఎన్నడూ లేనంతగా గంజాయి పట్టుబడుతుందని, ఈ అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు చేపట్టారంటూ ప్రశ్నించారు. దీనికి హోం శాఖ సహాయ మంత్రి నిత్యాంద రాయ్ మాట్లాడుతూ, ఏపీలో స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం గత మూడేళ్ళలో భారీగా పెరిగిందని తెలిపారు. 
 
2018 సంవత్సరంలో 33930 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా, 2019లో ఇది రెండింతలై 66665.5 కేజీలకు చేరిందన్నారు. గత యేడాది ఏకంగా 106642.7 కేజీలకు చేరిందన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు చేపట్టకుండా ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ సాగుకు అడ్డుకట్ట పడటం లేదని చెప్పారు.