కరోనాతో అల్లాడుతుంటే బార్లు అవసరమా? : సీపీఐ

శనివారం, 19 సెప్టెంబరు 2020 (09:21 IST)
ఏపీలో ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే ప్రభుత్వం బార్లు తెరవడం అవసరమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. ఇప్పటికే వైన్ షాపులకు అనుమతి ఇవ్వడంతో కరోనా వ్యాప్తి పెరిగిపోయి దేశంలో ఏపీ 2వ స్థానానికి చేరిందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజారోగ్యానికి తిలోదకాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను మాత్రమే అన్వేషిస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే బార్లకు అనుమతిచ్చి 20 శాతం కోవిడ్ ఫీజు, 10 శాతం ఏఈఆర్టీ విధించిందన్నారు.  పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.1 చొప్పున సెస్సు విధించి, ప్రజలపై రు.600 కోట్లు భారం మోపిందని మండిపడ్డారు.

ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.65 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని రామకృష్ణ తెలిపారు. ఈ ప్రభుత్వం కరోనాపై పోరాడుతున్న వైద్యులను గౌరవించకపోగా వారిపై వేధింపులకు, దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 6,09,558 కరోనా కేసులు, 5244 మరణాలు సంభవించాయన్నారు. 

అన్నీ చూడండి

Alia Bhatt : ఆల్ఫా లో ఆలియా భ‌ట్, శ‌ర్వారి భారీ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌ వుంటాయి: బాబీ డియోల్

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

తర్వాతి కథనం
Show comments