శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (17:13 IST)

నెల్లూరులో దారుణం.. మద్యం మత్తులో సజీవంగా పూడ్చిపెట్టేశాడు..

నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ మహిళను బలిగొంది. మద్యం మత్తులో ఓ మహిళను కొట్టి సజీవంగా పూడ్చిపెట్టాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. కొడవలూరులోని గొట్లపాలెం గ్రామంలో పొన్నూరు సుభాషిణి అనే మహిళ సాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి మద్యం సేవించి గొడవపడ్డారు. 
 
ఆ ఘర్షణలో సాములు కర్రతో గట్టిగా కొట్టడంతో.. సుభాషిణి సృహ కోల్పోయింది. వెంటనే ఆమెను పొదల్లో గుంత తీసి పూడ్చిపెట్టి.. కూతురిని బెదిరించి పారిపోయాడు. మృతురాలి కుమార్తె రెండు రోజులకు విషయం బంధువులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకు పంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాములు కోసం గాలింపు ముమ్మరం చేశారు.