suvichar
✕

నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 8 జూన్ 2021 (08:28 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరు జిల్లా ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వైద్యారోగ్య శాఖ సస్పెన్షన్ వేటువేసింది. ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో నిపుణులు చేసిన సిఫార్సుల మేరకే ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది.
 
జూన్‌ 5నే ప్రభాకర్‌ను కర్నూలు వైద్య కళాశాలకు బదిలీ చేస్తూ తాత్కాలిక చర్యలు తీసుకోగా తాజాగా సస్పెండ్‌ చేశారు. ఈ విచారణ సమయంలో నెల్లూరు విడిచి వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఆడియో రికార్డింగ్‌ ద్వారా బయటకు వచ్చిన వేధింపుల ఘటన 10 నెలల క్రితం జరిగినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆడియో టేపులు సామాజిక, ప్రసార మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

అన్నీ చూడండి

Maheshbabu : పుట్టినరోజు వేడుకలో ఆకట్టుకున్న మహేష్ బాబు, అల్లు అర్జున్, ఉపాసన, నాగచైతన్య

actress Anita : విమాన టికెట్ పేరిట సినీ నటి అనితకు సైబర్ వల నిజమేనా?

chiranjeevi: ఇట్లు అర్జున లోని కొత్త హీరో అనీష్‌ కు అగ్రహీరోలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ?

అనుమానాలతో మొదలై అద్భుత విజయం .. రూ.1483 కోట్లు వసూలు చేసిన 'రామాయణం '

చెప్పులు ధరించనని భీష్మ ప్రతిజ్ఞ చేసిన కోలీవుడ్ హీరో ఎవరు?

తర్వాతి కథనం