గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (16:20 IST)

నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై బదిలీ వేటు

నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్య కాలేజీ ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై ప్రభుత్వం బదిలీ వేటువేసింది. 
 
సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. ఈ లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెల్సిందే. పైగా, రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అలాగే, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఆళ్ళనాని కూడా జోక్యం చేసుకుని ఈ వేధింపులపై విచారణ జరిపి, పూర్తి నివేదిక ఇవ్వాలని శుక్రవారం ఆదేశించారు. 
 
మరోవైపు డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీలు ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, నివేదికను ప్రభుత్వానికి అందించాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేశారు.