సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (09:01 IST)

ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో ఉద్యోగ అవకాశాలు.. నేటితో డెడ్‌లైన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం తిరుప‌తిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ (ఎస్‌వీవీయూ)లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియ‌న్స్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఉద్యోగులను తీసుకోనున్నారు.
 
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ల్యాట్ టెక్నీషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిప్లొమా (డీఎంఎల్‌టీ) ఉత్తీర్ణ‌త సాధించాలి.
 
జిల్లాల వారీ ఖాళీల విష‌యానికొస్తే.. విశాఖ‌ప‌ట్నం (01), క‌డ‌ప (01), కృష్ణా (01), నెల్లూరు (02), శ్రీకాకుళం (01), విజ‌య‌న‌గ‌రం (01), తూర్పు గోదావ‌రి (01), ప‌శ్చిమ గోదావ‌రి (02), గుంటూరు (01), ప్రకాశం (01), చిత్తూరు (01), అనంత‌పురం (01) చొప్పున ఉన్నాయి. 
 
అయితే, ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీల‌కు ఐదేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుంగా రూ.200గా చెల్లించాల్సివుంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ 21.05.2021న ప్రారంభంకాగా.. 03.06.2021ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. పూర్తి వివ‌రాల‌కు https://svvu.edu.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.