బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (18:33 IST)

రుయా ఆస్పత్రి ఘటనపై ఏపీ సర్కారుకు నోటీసు

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మరణించడానికి కారణమైన ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై హైకోర్టు స్పందించింది. 
 
ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, డీఎంహెచ్‌వో, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. 
 
ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె .లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. అలాగే, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. మరోవైపు, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెల్సిందే.