గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 7 అక్టోబరు 2021 (18:07 IST)

లంబ‌సింగిలో షూటింగ్... నిహారిక ఆనందాతిశ‌యం

విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలో ఆంధ్రా కాశ్మీర్ గా పిలిచే లంబసింగిలో ఓ వెబ్ సీరియ‌ల్ షూట్ న‌డుస్తోంది. కృష్ణాపురం ఫారెస్ట్ లో ఈ వెబ్ సీరియల్ చిత్రీకరణ రెండు రోజుల నుంచి జరుగుతోంది. ఈ చిత్రీకరణలో భాగంగా మెగా ఫ్యామిలీ నుంచి మెగస్టార్ చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు కూతురు నిహారిక  కథానాయికగా నటిస్తోంది. 
 
లంబ‌సింగి అందాల‌ను చూసి, నిహారిక మైమర‌చిపోతోంది. నిహారిక మాట్లాడుతూ, ఇక్కడిప్రదేశాలు చాలా అందంగా ఆనందదాయకంగా ఉన్నాయని,  వీలైతే జనవరిలో మంచు అందాలను వీక్షించేందుకు మళ్ళీ ఇక్కడకు రావాలని అనుకొంటున్నానని ఈ సంధర్భంగా తెలియచేసారు. తాను ఎపుడూ లంబ‌సింగి గురించి విన‌డ‌మే కాని, రాలేద‌ని....ఇపుడు ఇంత బాగుంది అని అనిపిస్తోంద‌ని, అస‌లు ఎపుడో రావాల్సింది ఇక్క‌డికి అని నిహారిక చెపుతోంది.