Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన..రేపు బోస్టన్‌ కమిటీ నివేదిక

Written By ఎం
Updated: గురువారం, 2 జనవరి 2020 (19:45 IST)
రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

రైతుల ఆందోళనలు 16వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని రైతులు తమ ఆందోళనను ఉద్ధృతం చేయనున్నారు. రేపు 29 గ్రామాల్లో రైతులు సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చాయి.

16 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని రైతులు పిలుపునిచ్చారు.
 
రేపు సీఎంకు రాజధానిపై బోస్టన్‌ కమిటీ నివేదిక
రాజధానిపై బోస్టన్‌ కమిటీ రేపు నివేదిక సమర్పించనుంది. రాజధానిపై అధ్యయనం చేసిన బోస్టన్‌ కమిటీ నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఇవ్వనుంది.

జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికల అధ్యయానికి ప్రభుత్వం ఇప్పటికే హైపవర్‌ కమిటీని నియమించింది. ఈ నెల 8న జరిగే కేబినెట్‌ భేటీలో కమిటీ రిపోర్టుపై చర్చించనున్నారు. ఈ నెల 20లోగా హైపవర్‌ కమిటీ రిపోర్టును సమర్పించనుంది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments