వైకాపా నేత గుప్తా సుబ్బారావుపై అట్రాసిటీ కేసు
ప్రకాశం జిల్లాకు చెందిన అధికార వైకాపా నేత గుప్తా సుబ్బారావుపై ఒంగోలు జిల్లా పోలీసులు అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు గురువారం వెల్లడించారు.
ప్రకాశం జిల్లా ముంగమూరు సెంటరులో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక వైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులు కోరుతున్నారు. అదే అంశంపై వైకాపా నేత గుప్తా సుబ్బారావుతో వారంతా వెళ్లగా, వారిలో మేయరు గంగాడ సుజాత కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆమెను కులం పేరుతో గుప్తా సుబ్బారావు దూషించినట్టు మేయర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసుల ఈ కేసును నమోదు చేశారు.