బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (14:31 IST)

వృద్ధుడిని వశం చేసుకున్న పనిమనిషి, రూ. 10 లక్షలతో జంప్

తండ్రికి వయస్సు అయిపోతోంది. తల్లి మరణించింది. తనకు వివాహం చేసుకోవాలన్న ఆలోచన లేదు. దీంతో పని మనిషిని తీసుకువచ్చి పెట్టాడు. ఆ యువతికి వివాహం జరిగింది కానీ భర్త లేడు. ఇంటి పట్టునే ఉంటూ తండ్రిని చూసుకుంటుందన్న నమ్మకం ఏర్పడింది. ఇంటి దగ్గర పనిమనిషిని వదిలి తన వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళేవాడు కొడుకు. అదే అతను చేసిన తప్పుగా ఆ తరువాత తెలుసుకున్నాడు. 

 
రాజస్థాన్ లోని సోదాల గ్రామంలో నివాసముంటున్నారు కమల్, హుకుమ్ చంద్. హుకుమ్ చంద్ భార్య అనారోగ్యంతో చనిపోయింది. హుకుమ్ చంద్‌కు వయస్సు పైబడింది. ఒక్కగానొక్క కుమారుడు కమల్ పెళ్ళి చేసుకోలేదు.

 
పెళ్ళి చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే వచ్చిన భార్య తన తండ్రిని ఎలా చూసుకుంటుందోనన్న ఆలోచనతో పెళ్లి ఆలోచన మానేసాడు. దీంతో తండ్రిని చూసుకోవడానికి ఒక పనిమనిషిని మాట్లాడుకున్నాడు. ఆ పనిమనిషి పేరు గాయత్రి. వివాహమైంది కానీ ఆమె భర్తను వదిలేసింది. దీంతో ఇంటి పట్టునే ఉంటూ తండ్రి బాగోగులు దగ్గరగా చూసుకుంటుందని భావించాడు.

 
వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళిపోయేవాడు కమల్. అయితే హుకుమ్ చంద్ దగ్గర డబ్బులతో పాటు ఆస్తులు బాగా ఉన్నాయని గమనించింది గాయత్రి. ఇంకేముంది వృద్ధుడితో బాగా సన్నిహితంగా వుంటూ వచ్చింది. ఈ క్రమంలో అతడిని తనకు వశం చేసుకుని ఆ వృద్ధుడి అకౌంట్ లోని 10 లక్షల డబ్బుతో పాటు అతని పేర మీద ఉన్న 50 లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని సైతం తన పేరుపై రాయించుకుని ఉడాయించింది. ఇది తెలుసుకున్న కమల్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉంది.