మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 4 జూన్ 2018 (13:09 IST)

'ఆపరేషన్ గరుడు'... నిర్మాత, దర్శకుడు, రచయిత చంద్రబాబు: కృష్ణారావు సంచలనం

ఆపరేషన్ గరుడ గురించి ఈమధ్య చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆమధ్య నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ గరుడలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది భాజపా అనీ, ఆ పార్టీ ద్వారా ఏపీలో అటు పవన్ కళ్యాణ్, ఇటు జగన్ మోహన్ రెడ్డిలను ఇద్

ఆపరేషన్ గరుడ గురించి ఈమధ్య చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆమధ్య నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ గరుడలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది భాజపా అనీ, ఆ పార్టీ ద్వారా ఏపీలో అటు పవన్ కళ్యాణ్, ఇటు జగన్ మోహన్ రెడ్డిలను ఇద్దరినీ పావులుగా వాడుకుంటుందని శివాజీ ఆమధ్య చెప్పారు. ఆనాడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ నిజమేమోనంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇటీవలే దీనిపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అనుమానం వ్యక్తం చేయగా, నవనిర్మాణ దీక్షలో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఆపరేన్ గరుడ గురించి ప్రస్తావించారు. దీనితో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా దీనిపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
మూడు నెలల కిందట నటుడు శివాజీ చేసిన ఆరోపణ (ఆపరేషన్ గరుడ )కు సూత్రదారులు మీరేనంటూ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాఖ్యలు జోడిస్తూ...'ఆపరేషన్ గరుడకు తమరే నిర్మాత,దర్శకులు రచయిత. ఇందుకు ఓ నటుడిని ఎంపిక చేసి తమ మాటలు ఆయనతో పలికించారు. ఈ రోజు నవనిర్మాణ దీక్షలో ఆ నటుడు చెప్పింది నిజమే కావచ్చని సెలవిచ్చారు. ఏమి ఐడియా సాబ్జీ' అంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.