సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 26 జనవరి 2022 (10:32 IST)

పద్మశ్రీ హసన్ సాహెబ్ ది కృష్ణాజిల్లా తిరువూరే! నాద‌స్వ‌ర విధ్వాంసులు!!

నాదస్వర విధ్వాంసులు దివంగత హసన్ సాహెబ్ కు పద్మశ్రీ ల‌భించ‌డం నాద క‌ళాకారుల‌కు ఎంతో ఆనందాన్ని క‌లిగించింది. ఆయ‌న స్వ‌గ్రామం తిరువూరువాసులు కూడా త‌మ ఊరికి ఘ‌న కీర్తి ల‌భించిందంటున్నారు.
 
 
కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్  సాహెబుకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది. గంపలగూడెం మండలం గోసవీడులో జన్మించిన హసన్ సాహెబ్ యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలలో నిలయ విధ్వాంసులుగా చాలా ఏళ్ల పాటు సేవలు అందించారు. 
 
 
హసన్ సాహెబ్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలోనూ నిలయ విద్వాంసులుగా పనిచేశారు. గత 20 సంవత్సరాల నుండి ఆయన విశ్రాంతి తీసుకుంటూ తిరువూరులోనే స్థిరపడ్డారు. కొద్ది నెలల క్రితమే ఆయన మృతి చెందారు స్థానిక అశోక్ నగర్ లో ఆయన నివాసం ఉండేవారు. మరణానంతరం  హసన్ సాహెబ్ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.