ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (11:16 IST)

ఏపీలో ఓ వైపు ఎండలు.. ఓ వైపు వానలు.. రాబోయే 4 రోజుల్లో..

rain
ఏపీలో ప్రజలను ఓవైపు ఎండలు భయపెట్టేస్తుంటే.. మరోవైపు వానలు కాస్త ఊపిరిపీల్చుకునేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురువనున్నాయని చల్లని కబురు ఇచ్చింది.
 
ఇందులో భాగంగా తేలికపాటి వానలు పడనున్నట్లు తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు జిల్లాలో పలు చోట్ల స్వల్ప వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇంకా ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.