ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (10:51 IST)

తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. వర్షాలు.. ఎల్లో అలెర్ట్

Rains
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఎండలతో నానా తంటాలు పడుతున్న తెలంగాణ ప్రజలకు ఇది శుభవార్తే. రాష్ట్రంలో సోమవారం నుంచి ఆరు రోజుల పాటు అక్కడక్కడ  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
బుధ, గురు, శుక్రవారాల్లో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం వుందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక కూడా జారీ చేసింది.