సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (12:48 IST)

పవన్‌పై నిప్పులు చెరిగిన ముద్రగడ.. బ్లేడ్ బ్యాచ్ అంటారా?

mudragada padmanabham
కాపు నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలను కూడా తన దగ్గరికి రానివ్వడం లేదని తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేశారు. రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసే బౌన్సర్లు పవన్ కళ్యాణ్ చుట్టూ ఎప్పుడూ ఉంటారని ముద్రగడ పేర్కొన్నారు. 
 
వైఎస్‌ఆర్‌సీపీ నేతలను బ్లేడ్‌ బ్యాచ్‌ అంటూ పవన్‌ కల్యాణ్‌ అనడం విడ్డూరంగా ఉందని ముద్రగడ దుయ్యబట్టారు. పిరికితనం, అసమర్థతతోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతుండడంతో.. అస్వస్థతకు గురికావడంతో ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.