సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (14:33 IST)

పిఠాపురం ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు!!

pawan kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గత మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. నాలుగో రోజైన మంగళవారం ఆయన పర్యటిస్తున్నారు. ఆయన ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల తర్వాత యు.కొత్తపల్లి మండలం పొన్నాడలో ఉన్న బషీర్ బీబీ దర్గాను సందర్శించారు. చర్చిలోనూ, దర్గాకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత ఆయన ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశమయ్యారు. కాగా నాలుగో రోజు పర్యటనలో పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. 
 
పవన్ కళ్యాణ్ తన పర్యటనను ముగించుకుని బుధవారం తెనాలికి బయలుదేరి వెళతారు. ఆ తర్వాత ఈ నెల 4వ తేదీన నెల్లిమర్ల, 5వ తేదీన అనకాపల్లి, 6వ తేదీన యలమంచిలి, 7వ తేదీన పెందుర్తి, 8వ తేదీన కాకినాడ నియోకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. 9వ తేదీన ఉగాది పర్వదినం సందర్భంగా తిరిగి పిఠాపురంకు వచ్చిన ఆ నియోజకవర్గ ప్రజలతో కలిసి ఆయన ఉగాది వేడుకలను జరుపుకుంటారు. పిమ్మట 10వ తేదీన రాజోలు, 11వ తేదీన గన్నవరం, 12వ తేదీన రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు.