వైకాపా ఉడత ఊపులకు భయపడను.. : పవన్ కళ్యాణ్
వైకాపా ఉడుత ఊపులకు భయపడే వ్యక్తిని కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అదేసమయంలో ఆయన వైకాపా నేతలకు, పెద్దలకు గట్టి హెచ్చరిక చేశారు.
తనకు అండగా నిలబడిన గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం అధికారులు చేపట్టిన చర్యలు కారణంగా ఇల్లు కూల్చివేసిన బాధితులకు ఆయన ఆదివారం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను వైకాపా ఉడత ఊపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడిన ప్రతి ఒక్క వైకాపా నేతకు తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. బాధ్యతగా నడుకునేలా చెస్తామన్నారు.
తనకంటూ ఓ వ్యూహం ఉందన్నారు. వాటిని అమలు ప్రధానమంత్రికి చెప్పి చేయనున్నారు. తన రోడ్ మ్యాప్ ప్రకారం తాను ముందుకు సాగిపోతున్నట్టు చెప్పారు. పైగా, వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 175 సీట్లలో విజయం కావాలంట.. మేమంతా నోట్లో వేలుపెట్టుకుని కూర్చోవాలా అంటూ ప్రశ్నించారు.
అదేసమయంలో తన అడ్డు లేకుండా చేసుకునేందుకు వైకాపా పెద్దలు పెద్దపెద్ద ప్లాన్లు వేస్తున్నారన్నారు. వైకాపాలో సకల శాఖామంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఇదే తన హెచ్చరిక అని, మీరా మేమా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.