1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (11:12 IST)

వృద్ధ సైకో చంద్రబాబు.. ప్యాకేజీ కళ్యాణ్ పిచ్చి కుక్కలా..?: జోగి రమేష్

jogi ramesh
ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వృద్ధ సైకో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిండు సభలో జగన్‌ను బోండా ఉమ పాతరేస్తా అన్నాడని జోగి రమేష్ ఫైర్ అయ్యాడు. 
 
టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని అభివర్ణించారు. టీడీపీ తెలుగు వెన్నుపోటు పార్టీ కాదా అని నిలదీశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. అధికారం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారాలా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు సైకో మాటలు, సైకో భాష వాడతారని ధ్వజమెత్తారు. 
 
లోక జ్ఞానం లేని పప్పు జగన్‌పై కారు కూతలు కూస్తాడని.. ప్యాకేజీ కళ్యాణ్ పిచ్చి కుక్కలా మాట్లాడతాడని.. అతడు ప్యాకేజీ సైకో అని జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.