సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 జూన్ 2024 (19:24 IST)

పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు: ఆరా మస్తాన్ exit polls (video)

pawan kalyan
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే పీఠం అని ప్రధాన మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన మీదట ఆయా సంస్థలు ఈ ఫలితాలను వెల్లడించాయి. మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. గతంలో లేనంతగా ఏపీ ప్రజలు అత్యధిక శాతం ఓటింగులో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమిదే అధికారం అంటూ తేల్చాయి.
 
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ఆరా మస్తాన్ తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడించింది. జనసేన పోటీ చేసిన 2 లోక్ సభ సీట్లను కైవసం చేసుకుంటుందని వెల్లడించారు. తెనాలి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా విజయం సాధిస్తారని తెలియజేసారు.