శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (19:45 IST)

మహా పాదయాత్రకు అనుమతి: డీజీపీ సవాంగ్‌

రాష్ట్రంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు డీజీపీ సవాంగ్‌ అనుమతి ఇచ్చారు. రైతుల పాదయాత్రకు 20 షరతులతో డీజీపీ అనుమతి ఇచ్చారు.  హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు.

గుంటూరు అర్బన్‌, రూరల్‌, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్‌ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డీజే సౌండ్లు, బహిరంగసభలు నిర్వహించొద్దని డీజీపీ పేర్కొన్నారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎన్నికల కోడ్‌ పాటించాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రలో 157 మందికి మించి పాల్గొనకూడదని డీజీపీ ఆదేశించారు.

రైతుల పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని డీజీపీ షరతు విధించారు. ప్రతి రోజు ఉ.6 గంటల నుంచి సా.6 గంటలలోగా పాదయాత్ర ముగించాలని డీజీపీ సవాంగ్‌ ఆదేశించారు.