గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (14:56 IST)

పిఠాపురం ఆడపడుచులకు చీరలు, పసుపు కుంకుమ: పవన్ నూరేళ్లు చల్లగా వుండాలి (Video)

gift for women
పిఠాపురం శ్రీపాదగయ పురుహూతికా అమ్మవారి క్షేత్రంలో శుక్రవారం పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యామ్ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం ఆడపడుచులకు సంప్రదాయ ఆనవాయితీ ప్రకారం 12 వేల చీరలు, పసుపు కుంకుమను ఆయన అందజేశారు. దీంతో పిఠాపురం మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తున్నారు. ఇంత వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో వేలాదిమంది మహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొని అమ్మవారి సమక్షంలో చీర, పసుపు, కుంకుమ అందుకోవడం జరిగిందని తెలిపారు.