గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 14 డిశెంబరు 2021 (15:02 IST)

గాడిదలతో సమానంగా చూస్తాం... ఆడవాళ్లతో బుద్ది చెప్పిస్తాం...

ముపాళ్ళ‌లోనియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఈపూరు మండలం ముప్పాళ్ళలోని ఎస్సీ కాలనీలో  కుల క‌లం ఇది! వైసీపీ నేత‌ల‌పై ఫ్లెక్సీలు వెలిసిన ఉదంత‌మిది. గుంటూరు జిల్లా వినుకొండ వెలసిన ఈ ఫ్లెక్సిని చూసి, ప్ర‌జ‌లు ఔరా రాజ‌కీయం అని ముక్క‌న వేలేసుకుంటున్నారు. స్థానిక రాజ‌కీయ నేత‌ల చేతిలో మోసపోయిన వైసిపి కార్యకర్తల పేరుతో ఈ ప్లెక్సీ  ఏర్పాటయింది.
 
 
ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌లు గ్రామాల్లో రాజ‌కీయ‌, సామాజిక కుంప‌ట్ల‌ను రాజేశాయి. అధికార వైసీపీ బ‌డా నేత‌లు త‌మ ఎస్సీ వ‌ర్గాల వారికి ఎన్నికలలో ఓట్లు కోసం వాడుకున్నార‌ని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను వదిలేశార‌ని స్థానిక వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

 
మమ్మల్ని అవమానపర్చిన వారికి తగు రీతిలో సమాదానం చెబుతాం. వైసిపి నేతలు మా కాలనీ జోలికి వస్తే  గాడిదలతో సమానంగా ఆడవాళ్లతో బుద్ది చెప్పిస్తాం అని ఈ ఫ్లెక్సీలు రాసారు. అంతే కాదు... నేత‌లు ఇక‌పై మా కాల‌నీల‌కు వ‌స్తే, గ‌ట్టిగా స‌మాధానం చెపుతాం అని కూడా హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు.