అలాంటి వారు భక్తి వ్యభిచారులు.. ప్రభోదానందస్వామి

పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రభోదానంద స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను శ్రీకృష్ణుడిని మాత్రమే ఆరాధిస్తున్నానని.. భగవద్గీతను అనుసరిస్తున్నట్లు తెలి

Written By selvi
Updated: బుధవారం, 3 అక్టోబరు 2018 (12:17 IST)
పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రభోదానంద స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను శ్రీకృష్ణుడిని మాత్రమే ఆరాధిస్తున్నానని.. భగవద్గీతను అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువమంది దేవుళ్ళను ఆరాధించేవారు భక్తి వ్యభిచారులని ప్రబోధానంద స్వామి అన్నారు.


తమ ఆశ్రమంపై పలువురు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభోదానంద ఖండించారు. అదే విధంగా చిన్నపొలమడలో జరిగిన హింసాత్మక సంఘటనపై స్పందించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 
 
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో చిన పొలమడ వద్ద ప్రభోదానంద ఆశ్రమం వద్ద జరిగిన హింసాత్మక సంఘటలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రభోదానందపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయగా మరొకొందరు గుత్తి పోలీస్ స్టేషన్‌లో ప్రభోదానంద స్వామిపై కేసు నమోదు చేశారు.

తన కేసు విషయాన్ని కోర్టులే తేలుస్తాయని అన్నారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం జరిగిన రోజున హింసాత్మక సంఘటనలు జరగడం ఆ ఘటనలో కొందరు చనిపోవడానికి కారణం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డేనని ప్రభోదానంద ఆరోపించారు.

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments