గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (09:50 IST)

కోవిడ్ 19 రెండో విడత వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు : టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి

తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
 
-  కోవిడ్ 19 రెండవ విడత వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా టిటిడి అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
 
-  టిటిడి మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతోంది.
 
-  వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణ కట్ట తో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
 
-   సర్వ దర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాము. భక్తులు ఈ మార్పును గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
 
- సర్వదర్శనం టోకెన్లు తగ్గించిన విషయాన్ని ఇతర రాష్ట్రాల భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాం.
 
-  అన్న ప్రసాద కేంద్రం, గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు ఏర్పాటు చేశాము.
 
- అద్దె గదుల్లో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. ఖాళీ చేసిన వెంటనే పూర్తిగా శానిటైజ్ చేస్తాం.
 
-  తిరుమలకు వచ్చే భక్తులు తమ వెంట తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ లు తెచ్చుకోవాలని కోరుతున్నాము.
 
-  వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయంలో టిటిడి ఏర్పాటు చేసిన శానిటైజర్ లు భక్తులు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
 
-  తిరుమలలోని ప్రతి ప్రాంతంలో భక్తులు భౌతిక దూరం పాటించాలని కోరుతున్నాము.
 
- కోవిడ్ పరిస్థితులను అంచనా వేసుకుని రానున్న రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా తగ్గిస్తాం.
 
- అలిపిరి వద్ద ప్రతి వాహనాన్నీ శానిటైజ్ చేస్తాం. భక్తులందరికీ థర్మల్ స్కాన్ చేస్తాం.
 
- భక్తుల సౌకర్యార్థం జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు తిరుమలకు రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం.
 
- కోవిడ్ పరిస్థితులను అంచనా వేసి ఏప్రిల్ 14 నుండి ఆర్జితసేవలను ప్రారంభించే విషయాన్ని పునఃపరిశీలిస్తాం.
 
- తిరుమలలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించి కోవిడ్ జాగ్రత్తలపై సూచనలిచ్చాం.  ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేయిస్తున్నాం.
 
 
తలనీలాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం : అదనపు ఈఓ
 
- తలనీలాల నిల్వ, వేలం, తరలింపునకు సంబంధించి టిటిడిలో పటిష్టమైన వ్యవస్థ ఉంది. తలనీలాలు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదు.
 
- ఇ-వేలంలో పొందిన బిడ్డర్ కు తలనీలాలు అప్పగించడం వరకే టిటిడి బాధ్యత. 
 
- తలనీలాల తరలింపునకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.
 
- ఈ విషయమై మిజోరాం పోలీసులను, అస్సాం రైఫిల్స్ పోలీసులను సంప్రదించాం. ఈ కేసు మూలలను గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 
మీడియా సమావేశంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి పాల్గొన్నారు.