గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (14:26 IST)

దేశ భాషలందు తెలుగు లెస్స : రాష్ట్రపతి ముర్ము

droupadi murmu
దేశ ప్రజలందరికీ తెలుగు భాష, తెలుగు సాహిత్యం సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు విజయవాడ సమీపంలోని పోరంకి పౌర సన్మానం జరిగింది. ఇందులో రాష్ట్ర గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌లు పాల్గొని ఆమెను సన్మానించారు. 
 
ఇందులో రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, తెలుగు భాష గొప్పదనం దేశం మొత్తానికి తెలుసన్నారు. తెలుగు భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. కలియుగందైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైవున్న పవిత్ర స్థలానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, కనకదుర్గమ్మ ఆశీసులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి చెందిన మహనీయులు అల్లూరు, గురజాడ, కవయిత్రి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయని చెప్పారు. ఆంధ్ర ప్రజలన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలిపారు.