గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (19:55 IST)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సారీ చెప్పిన వెస్ట్ బెంగాల్ సీఎం

mamata benerjee
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బహిరంగ క్షమాపణలు చెప్పారు. పార్టీ తరపున సారీ చెబుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
మమతా బెనర్జీ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్న అఖిల్ గిరి ఆదివారం బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేస్తూ, రాష్ట్రపతి ముర్ము రూపాన్ని ప్రస్తావించారు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే, ముర్ము సొంత రాష్ట్రంలో ఒరిస్సాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి ముర్ముపై తమకు ఎనలేని గౌరవం ఉందని, అయినా ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని ఆమె అన్నారు. తమ పార్టీ తరపున ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడాలని ఆమె తమ పార్టీ నేతలతో పాటు మంత్రివర్గ సహచరులను హెచ్చరించారు. అలాగే, మంత్రి అఖిల్ గిరి కూడా రాష్ట్రపతికి సారీ చెప్పారు.