గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (12:48 IST)

నవ ప్రభుత్వ కర్తవ్యాలు... జగన్‌కు ట్రిపుల్ ఆర్ మరో లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైకారా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖను సంధించారు. నవ కర్తవ్యాల పేరుతో ఈ లేఖను రాశారు. ఏపీలో పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ) ఛైర్మన్‌గా రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ నియామకానికి ట్రిపుల్ ఆర్ తప్పుబట్టారు. రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌గా నియమించడంపై స‌రికాద‌ని చెప్పారు.

నిబంధనల ప్రకారం 65 ఏళ్ల  వ‌య‌సులోపు ఉన్నవారు పీసీఏ చైర్మన్‌ పదవికి అర్హులని గుర్తుచేశారు. అయితే, కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌ చేసేందుకే నిబంధన 4(ఏ)ను సవరించారన్నారన్నారు. 

ప్రజల్లో జ‌గ‌న్ ఇమేజ్ పలుచన కాకూడదని ఆర్ఆర్ఆర్ చెప్పారు. అందుకే తనలాంటి వారు ఆయ‌న‌కు ఇలాంటి అభిప్రాయాలు చెబుతున్నార‌న్నారు. ఏపీలో పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ చైర్మ‌న్ విష‌యంలో జ‌గ‌న్ మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయ‌న కోరారు