సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మే 2020 (17:07 IST)

తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తాకిడి అధికంగా వుంది. అయితే తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచన ఉందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. 
 
రానున్న 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్ర తీరం ఆనుకొని బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని.. మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇంటీరియర్‌ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగనుంది.