బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మే 2020 (20:12 IST)

తెలంగాణలో జూన్ 1 నుంచి మెట్రో సర్వీసులు..

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో దాదాపు రైలు, బస్సులు అన్ని వాహనాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి నిలిచిపోయిన మెట్రో సర్వీసులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. జూన్ 1 తర్వాత నుంచి మెట్రో సర్వీసులు మొదలు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రారంభించగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో సిటీ బస్సులు, మెట్రో సర్వీసులను మాత్రం నిలిపేసింది. దీనితో ప్రైవేట్, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 
 
ఈ తరుణంలో ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని 32 మార్గాలకు సిటీ బస్సు సర్వీసుల సదుపాయాన్ని కల్పిస్తూ అనుమతులు ఇచ్చారు. మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానుండటంతో చాలామంది ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు